కలిస్ చెత్త రికార్డును సవరించిన ఏబీ డివిలియర్స్
Updated:
05-03-2018 07:15:23
డర్బన్: దక్షిణాఫ్రికా ఆటగాడు తన కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ రనౌట్ అయిన డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరపున అత్యధికసార్లు రనౌటైన ఆటగాడిగా రికార్డు చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ రనౌట్‌తో ఏబీ మొత్తం 28 సార్లు రనౌట్ జాక్వస్ కలిస్ పేరును ఉన్న అత్యధిక రనౌట్ల రికార్డును సవరించాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో ఓవర్ చివరి బంతిని స్క్వేర్‌లెగ్ వైపు ఆడిన ఏబీ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని మరో ఎండ్‌లో ఉన్న మార్క్‌రమ్ విరమించుకుని క్రీజులోకి వెళ్లిపోగా అప్పటికే ముందుకొచ్చిన ఏబీ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే బంతిని అందుకున్న లయన్ వికెట్లను గిరాటేయడంతో ఏబీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో విజయం సాధించింది.