మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

చిరు పిలుపుతో కదిలి వచ్చిన టాలీవుడ్

Updated: 24-04-2018 11:30:09

హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియోలో తెలుగు హీరోల కీలక సమావేశం జరిగింది. పరిశ్రమలో తాజా పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి 18 మంది హీరోలు సమావేశమై చర్చలు జరిపారు. అల్లూ అరవింద్, నాగబాబు, మహేశ్‌బాబు, రామ్ చరణ్, అల్లూ అర్జున్, నాని, వరుణ్‌తేజ్, నాగచైతన్య, సుమంత్, రామ్, రాజశేఖర్, జీవిత తదితరులు హాజరయ్యారు. క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు అనేక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. కొంతకాలంగా టాలీవుడ్‌లో ఇబ్బందికర పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో సమస్యల పరిష్కారానికి అందరూ యత్నించినా సఫలీకృతులు కాకపోవడంతో మెగాస్టార్ తొలిసారి లీడ్ తీసుకున్నారు. అన్ని సమస్యలనూ పరిష్కరించేందుకు నడుం కట్టారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక్కతాటిపై నిలిచేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.