ఎవరికి సీట్లివ్వాలో నాకు తెలుసు: చంద్రబాబు
Updated:
04-05-2018 03:03:30
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణకు టీడీపీ అధినేత చంద్రబాబు క్లాస్ పీకారు. సమస్యలపై మరింత సీరియస్‌గా పోరాటం చేయాలని సూచించారు. మెతకగా ఉంటే కుదరదని, అలసత్వం వద్దని చెప్పారు. గ్రూప్ రాజకీయాలు మాని అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. ఎవరికి సీట్లివ్వాలో తనకు తెలుసని ఇప్పటికే జాబితా సిద్ధం చేశానని చంద్రబాబు చెప్పారు. ముందే టికెట్లు ప్రకటిస్తానన్నారు. మహానాడు తర్వాత మళ్లీ వస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలతో నిర్వహించిన ఈ సమావేశానికి మోత్కుపల్లి సహా మరికొందరు నేతలు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.