టిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్
Updated:
11-03-2018 08:50:48
హైదరాబాద్: టిఆర్ఎస్ తరపున రాజ్యసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్ధుల పేర్లను తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. టిఆర్ఎస్ఎల్‌పి సమావేశంలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ్ర ప్రకాశ్ ముదిరాజ్ పేర్లు ఖరారు చేశారు. వీరు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల బాధ్యతను కేటీఆర్, ఈటల, జగదీశ్‌కు అప్పగిస్తూ సిఎం ఆదేశాలు జారీ చేశారు. తాను తెలంగాణాలోనే ఉంటూ జాతీయ రాజకీయాల్లో పాల్గొంటానని కేసీఆర్ తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు 106 సీట్లు ఖాయమని కేసీఆర్ చెప్పారు. తాను చేయించిన సర్వేల ద్వారా ఇది వెల్లడైందన్నారు.