అమెరికాలో కాల్పుల కలకలం
Updated:
20-03-2018 07:34:08
మేరీల్యాండ్: అమెరికా మేరీల్యాండ్‌లోని ఓ హైస్కూల్‌లో కాల్పులు జరిగాయి. ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. క్యాంపస్‌ను మూసివేశారు. హైస్కూల్ చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అమెరికాలో ఇటీవల కాలంలో కాల్పుల ఘటనలు పెరిగాయి. అమాయక పౌరులు చనిపోతున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్న వేళ ఈ కాల్పుల ఘటన జరగడం కలకలం రేపుతోంది. కాల్పులు జరిపిన వాడు విద్యర్థి అని తెలిసింది.