మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఎన్డీయేకు టీడీపీ గుడ్‌బై

Updated: 16-03-2018 09:16:18

అమరావతి: ఎన్డీయేకు టీడీపీ గుడ్‌బై చెప్పింది. కొద్దిసేపటి క్రితం పొలిట్ బ్యూరో సభ్యులతో నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని టీడీపీ పొలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కేంద్రంపై టీడీపీ నేడు సొంతంగానే అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. కేంద్రంపై ఇప్పటికే వైసీపీకి మద్దతిస్తామని ప్రకటించిన టీడీపీ అనూహ్యంగా వ్యూహం మార్చి తామే అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించింది. నేడు టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి పెద్ద ఎత్తున మద్దతు సాధించగలిగారు. 
 
పార్లమెంట్‌లో పార్టీల వారీగా బలాబలాలు 
 
బిజెపి 273, కాంగ్రెస్ 48, అన్నాడిఎంకే 37, తృణమూల్ 34, బీజేడీ 20, శివసేన 18, టీడీపీ 16, టీఆర్ఎస్ 11,  సిపిఎం 9, సిపిఐ 1, ఎంఐఎం 1, ఆమ్ ఆద్మీ పార్టీకి నలుగురు ఎంపీలున్నారు. 
వీరిలో 50 మంది మద్దతు కూడగడితే తీర్మానానికి ఆమోదం లభిస్తుందని టీడీపీ చెబుతోంది. 
 
టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమే అయినా బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు పెరుగుతుండటం కమలనాథుల్లో కలవరం రేపుతోంది. చిరకాల స్నేహితుడు అయిన టీడీపీ కేంద్రం నుంచి వైదొలగడం, ఆపై ఎన్డీయేకు గుడ్‌బై చెప్పడం సరైన సంకేతాలు కావని బీజేపీ భావిస్తోంది.  

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.