మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

ప్రధానిని కలిసి రాజీనామాలు సమర్పించనున్న టిడిపి మంత్రులు

Updated: 08-03-2018 11:26:14

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో ఉన్న ఏపీ మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నేడు రాజీనామాలు చేయనున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాని రాజస్థాన్ పర్యటన నేపథ్యంలో టీడీపీ మంత్రులకు ఇంకా అపాయింట్‌మెంట్ దొరకలేదు. ప్రధాని రాజస్థాన్ పర్యటన పూర్తయ్యాక సాయంత్రం అయినా సరే ఆయన్ను నేరుగా కలుసుకుని రాజీనామా చేయాలని ఇద్దరు మంత్రులూ నిర్ణయించుకున్నారు. అప్పటికీ ప్రధాని కలవకపోతే పిఎంఓ కార్యాలయంలో రాజీనామా పత్రాలను సమర్పించాలని నిర్ణయించారు. నిన్న ఏపీ టీడీపీ మంత్రులతో సమావేశమైన చంద్రబాబు అదే సమయంలో టీడీపీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ ఎన్డీయే నుంచి బయటకు రావాలని సూచించారు. అయితే తొలుత కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించాలని నిర్ణయించి రాజీనామా చేయాలని అశోక్ గజపతిరాజుకు, సుజనా చౌదరికి సూచించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులూ నేడు రాజీనామా చేయనున్నారు.  

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.