మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

జనసేనలోకి లక్ష్మీ నారాయణ!

Updated: 23-03-2018 07:27:09

ముంబై: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపిఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న ఆయన వాలంటరీ రిటైర్ మెంట్‌కు అనుమతించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. సీబీఐ అదనపు జేడీగా గతంలో పనిచేసిన లక్ష్మీ నారాయణ జగన్ కేసుతో పాటు గాలిజనార్ధన్ రెడ్డి కేసు విచారణలో కీలకపాత్ర పోషించారు. మహరాష్ట్ర కేడర్ కు చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతానికి చెందిన లక్ష్మీ నారాయణ సీబీఐలో డిప్యూటేషన్ పూర్తి అయిన తర్వాత మళ్లీ మహరాష్ట్రకు వెళ్లారు. అక్కడ ఆయన ప్రస్తుతం ప్లానింగ్‌ అదనపు డీజీపీగా పనిచేస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం ప్రస్తుతం లక్ష్మీనారాయణ పెదవి విప్పలేదు. త్వరలో భవిష్యత్ కార్యచరణ తెలియచేస్తానన్నారు. మరోవైపు త్వరలో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. లక్ష్మీ నారాయణ చేరికతో పవన్‌ పార్టీకి మరింత శక్తి వస్తుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు ఏపీ బీజేపీ వర్గాలు కూడా లక్ష్మీ నారాయణే తమ సిఎం అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు.

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.