మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా టుడే ఒపీనియన్ పోల్

Updated: 13-04-2018 07:01:03

బెంగళూరు: కర్ణాటకలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇండియాటుడే- కార్వీ ఒపినీయన్ పోల్‌లో తేలింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఏర్పడనుందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 90-101 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. బిజెపికి 78-86 సీట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. జేడీఎస్‌కు 34-43 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తద్వారా జేడీఎస్ అధినేత కుమారస్వామి కీలక పాత్ర పోషిస్తారని వెల్లడించింది. సిద్ధరామయ్యను సిఎంగా 33 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని ఇండియాటుడే- కార్వీ ఒపినీయన్ పోల్‌ స్పష్టం చేసింది. 224 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరగనున్నాయి. మే 15న ఫలితాలు వెలువడతాయి. లింగాయత్‌లను ప్రత్యేక మతంగా పరిగణిస్తామంటూ సిఎం సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి ఒపినీయన్ పోల్‌ లెక్కల్లో మార్పులు చోటు చేసుకోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు.

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.