నవాజ్‌షరీఫ్‌కు ఘోర అవమానం
Updated:
12-03-2018 01:39:28
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు ఘోర అవమానం ఎదురైంది. లాహోర్‌లోని జామియా యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక అగంతకుడు ఆయనపై అతి సమీపం నుంచి చెప్పు విసిరాడు. అది నేరుగా నవాజ్‌కు బలంగా తగిలింది. దీంతో నవాజ్ షరీఫ్ బిత్తరపోయారు. చెప్పు విసిరాక ఆ అగంతకుడు నవాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవాజ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన తన పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన పార్టీ పిఎంఎల్ఎన్ అధికారంలోనే ఉన్నా ఆయన ఒంటిరి అయిపోయారు. తాజాగా జరిగిన అవమానంతో ఆయన రగిలిపోతున్నారు. చెప్పు విసిరిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.