మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

సల్మాన్ ఖాన్‌పై నటి సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు!

Updated: 07-04-2018 09:05:33

జోధ్‌పూర్: కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రస్తుతం జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై  బాలీవుడ్ నటి సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. జైలుకు వెళ్లిన సల్మాన్‌పై ప్రతి  ఒక్కరు సానుభూతి తెలుపుతున్న వేళ సోఫియా మాత్రం విరుచుకుపడింది. సల్మాన్‌ను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెద్ద పోస్టు చేసింది. అతనో పెద్ద స్టార్ కాబట్టే అతడికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అందరూ వెనకడుగు వేస్తున్నారని, కానీ తనకా భయం లేదని పేర్కొంది. చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవిస్తున్నాడని, కర్మ ఫలితంగానే జైలుకు వెళ్లాడంది. సల్మాన్ జైలుకు వెళ్లడం తనకు ఆనందంగా ఉందని పేర్కొంది. ‘నో మోర్ హ్యూమన్’ అంటూ సల్మాన్ ఫొటోను పోస్టు చేసిన సోఫియా చివర్లో ‘హిందూస్థాన్ జిందాబాద్’ అని ముగించింది.

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.