మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

బిజెపికి టిడిపి గుడ్‌బై ?

Updated: 06-03-2018 11:48:08

అమరావతి: బిజెపికి గుడ్‌బై చెప్పాలని టిడిపి యోచిస్తోంది. టీడీఎల్‌పి సమావేశంలో బీజేపీతో సంబంధాలు తెంచుకునే అంశంపై వాడీవేడీ చర్చ జరిగింది. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని సూచించారు. ఏపీలో కూడా బిజేపీకి దూరం జరగాలన్నారు. కేంద్రంతో సఖ్యతపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తానని చంద్రబాబు చెప్పారు. రెండ్రోజుల్లోనే బిజెపితో కటీఫ్ వార్త చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి.
 
మరోవైపు ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. గతంలో ప్రకటించిన హోదా మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేసింది. పరిశ్రమలకు రాయితీలివ్వడం ఇప్పట్లో కుదరదని తేల్చి చెప్పింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో ఒక్క రూపాయికీ లెక్క చెప్పలేదని తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలూ అడుగుతాయని కేంద్రం అభిప్రాయపడినట్లు తెలిసింది.  
 
అటు టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలనూ కలుపుకుపోయినా లాభం ఉండదన్నారు. కేంద్ర వైఖరిని జేసీ తప్పుబట్టారు. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.