ఇక ఒక్కొక్కడికి ఉంటుందీ.. విరుచుకుపడిన నాగబాబు
Updated:
22-04-2018 09:36:40
హైదరాబాద్: సినిమాలను వదిలేసి ప్రజల కోసం ఏదో చేయాలని వచ్చిన తన సోదరుడు పవన్ కల్యాణ్‌పై ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని, నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన సోదరుడు నాగబాబు ఆరోపించారు. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ సినిమాల్లో నంబరు వన్ పొజిషన్‌ను, కోట్లాది రూపాయలను వదిలేసి ప్రజా సేవ కోసం వస్తే అతడిని తొక్కేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పవన్ తన భవిష్యత్తును పణంగా పెట్టి వచ్చాడని, అతడిని అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ ఒక్కేడనని, కానీ అతడి వెనక చాలామంది పవన్‌లు ఉన్నారని అన్నారు. తమ కుటుంబాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్లందరి దుమ్ము దులిపేందుకు వస్తున్నాడని హెచ్చరించారు. ఇక ఒక్కొక్కడికి సంగతి చూస్తామంటూ తీవ్రస్థాయిలో నాగబాబు హెచ్చరించారు.