మమతతో కేసీఆర్ భేటీ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ
Updated:
19-03-2018 12:53:22
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోల్‌కతా బయలుదేరారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన కోల్‌కతాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. కోల్‌కతాలో ఆయన తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీతో సమావేశమౌతారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు. ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని కేసీఆర్ ప్రకటన చేయగానే మమత అభినందనలు తెలిపారు. కలిసి పనిచేద్దామన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మమతను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై లోతుగా చర్చించనున్నారు. బిజెపి, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆయన తలపోస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ జెండా, అజెండాపై మమతతో చర్చిస్తారు. త్వరలో మరిన్ని పార్టీల నేతలతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై లోతుగా చర్చిస్తారు. కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను ఒక తాటిపైకి ఫెడరల్ ఫ్రంట్‌లోకి తీసుకువచ్చే లక్ష్యంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు.