ఖమ్మం జిల్లాలో రోడ్డుప్రమాదం.. పెళ్లికొడుకు సహా ఐదుగురు దుర్మరణం
Updated:
09-03-2018 09:42:26
పల్లిపాడు: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వరంగల్ జిల్లా వర్దన్నపేటవాసులు. తణుకులో పెళ్ళి చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పెళ్లికొడుకు, అతడి అక్క, బావ, అత్త కూడా ఉన్నారు. మరణించిన వారిని రామకృష్ణ ప్రసాద్( పెళ్లికొడుకు), కొమ్మాటూరు శరత్, శ్రీదేవి, శేషం పద్మ, వడ్లకొండ వేణు (డ్రైవర్)గా గుర్తించారు. పెళ్లికూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని సమాచారం.