దారుణం: హాల్‌టికెట్ ఇవ్వలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Updated:
28-02-2018 08:26:50
వనపర్తి: పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తిలో దారుణం జరిగింది. రావూస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నవీన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం హాల్‌టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో మనస్తాపం చెందిన చెందిన నవీన్ కాలేజీ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.