మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

‘ఎన్టీఆర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేయాల్సిందే’

Updated: 28-02-2018 07:51:08

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు విచిత్ర అనుభవం ఎదురైంది. చంద్రబాబు మాట్లాడుతుండగా కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బీజేపీతో కూడా పొత్తు వద్దంటే వద్దని ప్లకార్డులు ప్రదర్శించారు.
 
స్పందించిన చంద్రబాబు కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో టీడీపీ శాశ్వతంగా ఉంటుందని, పార్టీని విలీనం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అందరితో చర్చించిన తర్వాతే పొత్తులను నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీ మనుగడ సాగించాలంటే పొత్తు అవసరమన్న చంద్రబాబు టీఆర్ఎస్‌తో పొత్తుకు సంకేతాలిచ్చారు. తెలుగు ప్రజలను కాంగ్రెస్ నాశనం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.