మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

సుబ్బయ్య ఉరేసుకున్నాడు: అధికారికంగా ప్రకటించిన డీజీపీ

Updated: 04-05-2018 02:04:16

గుంటూరు: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ సుబ్బయ్య ఉరేసుకున్నది నిజమేనని పోలీసులు తేల్చారు. గురజాల మండలం దైద గ్రామంలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో సుబ్బయ్య ఉరేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. అయితే సుబ్బయ్య ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం వైద్యులే తేల్చాలని ఏపీ డీజీపీ మాలకొండయ్య చెప్పారు. అటు తాను చనిపోవడానికి వెళ్తున్నానని సుబ్బయ్య ఇప్పటికే తన బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. తన కుమారుడి పరువు తీసేశానని, తాను చనిపోతానని చెప్పినట్లే చేశాడు. అన్నట్లుగానే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు తన కుమార్తె బాధ చూడలేకపోతున్నానని బాధితురాలి తల్లి వాపోయారు. సుబ్బయ్యలోని దారుణమైన లక్షణాన్ని తమ తొమ్మిదేళ్ల చిన్నారి గుర్తించలేకపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.