గబ్బర్ సింగ్ గురితప్పాడు: డొక్కా మాణిక్యవరప్రసాద్
Updated:
15-03-2018 10:52:46
విజయవాడ: జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పందించారు. చంద్రబాబు, లోకేశ్‌పై పవన్ చేసిన విమర్శలు వెనక్కు తీసుకోవాలన్నారు. వెంటనే చంద్రబాబు, నారా లోకేశ్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. గబ్బర్ సింగ్ గురితప్పాడన్నారు. బిజెపికి వైసీపీ ఏ టీం అయితే, జనసేన బి టీంలా ఉందని డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. భోజనం మధ్యలోనే మజ్జిగ అన్నం తిని, ఆ తర్వాత మళ్లీ కూరలతో తిన్నట్లుగా పవన్ తీరు ఉందన్నారు. పవన్ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడారని డొక్కా విమర్శించారు. కొత్తగా కనిపెట్టినట్లుగా లోకేశ్ అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని డొక్కా విమర్శించారు. పూర్తి ఆధారాలు ఉంటేనే హుందాగా ఆరోపణలు చేయాలని సూచించారు. జగన్ చెప్పిన మాటలే పవన్ వల్లెవేస్తున్నారని డొక్కా ఆరోపించారు.