మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

చంద్రబాబుకు అమిత్ షా లేఖతో కలకలం

Updated: 24-03-2018 11:13:03

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తనకు చంద్రబాబు రాసిన లేఖకు జవాబుగా ఈ లేఖ రాశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించిందన్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగాలన్న నిర్ణయం దురదృష్టకరమని చెప్పారు. అదే సమయంలో టీడీపీ నిర్ణయం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయమని, ఈ నిర్ఫయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. అభివృద్ధి కంటే రాజకీయ కారణాల కారణంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
 
ఐదు కోట్ల మంది ఏపీ తెలుగు సోదర సోదరీమణులకు అమిత్ షా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కోసం కట్టుబడిన పార్టీ బిజెపి అని అమిత్ షా చెప్పారు. కేంద్రం తరపున చేపట్టిన అనేక కార్యక్రమాలు, విభజన చట్టంలోని అంశాలను, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను 9 పేజీల లేఖలో అమిత్ షా ప్రస్తావించారు. ఏపీకి సంబంధించి ఏ విషయంలోనూ వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చిన మూడు ఎయిర్‌పోర్ట్‌లను, రాజధానికి వెయ్యి కోట్లు ఇస్తే కేవలం 8 శాతం నిధుల లెక్కలు మాత్రమే పంపారని తన లేఖలో అమిత్ షా పేర్కొన్నారు. అమరావతిలో రైల్ రోడ్ నిర్మాణానికి 180 కిలోమీటర్ల రింగ్‌రోడ్‌కు నిధులను ప్రస్తావించారు. కొత్త రైల్వే జోన్‌కు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. గతంలో టీడీపీకి ఉభయసభల్లో ప్రాధాన్యత లేనప్పుడు బిజెపియే అజెండా తయారు చేసిందని, ఏపీ తరపున బీజేపీయే వాదనలు వినిపించిందని షా గుర్తు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తి స్థాయిలో నెరవేర్చిందని చెప్పారు. టీడీపీకి, ఏపీ ప్రజలకు బీజేపీనే నిజమైన స్నేహితుడని అమిత్ షా గుర్తు చేశారు.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.