చంద్రబాబు నిజమే అంటే నన్ను ఉరితీయండి: శివాజీ
Updated:
28-03-2018 08:50:58
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవిని తనకు ఇవ్వనందుకే తాను టీడీపీపై విరుచుకుపడుతున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ సినీ నటుడు శివాజీ ఖండించారు. తానెప్పుడూ టీడీపీ చైర్మన్ పదవో, సభ్యుడి పదవో కావాలని ముఖ్యమంత్రిని అడగలేదని తేల్చి చెప్పారు. అసలు దర్శనానికి కూడా తానెప్పుడూ టికెట్ కావాలని అడగలేదని పేర్కొన్నారు. కావాలంటే ఆ విషయాన్ని నేరుగా చంద్రబాబును అడిగి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ చంద్రబాబు కనుక నేను అడిగానని చెబితే ఉరితీయాలని అన్నారు. తనకే కనుక పదవీ కాంక్ష ఉంటే చంద్రబాబు నాయుడుతోనే, బీజేపీతోనే కలిసి ఉండాలిగా అని ఎదురు ప్రశ్నించారు. ఓ తెలుగు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు.