Updated: 21-03-2018 10:30:55
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పవన్ ఆమరణ దీక్ష చేయవద్దని సినీ రచయిత, నటుడు పోసాని చెప్పారు. అసలు పవన్ ఎందుకు ఆమరణ దీక్ష చేయాలని పోసాని ప్రశ్నించారు. దీక్ష పేరుతో చంపడానికి ప్లాన్ చేశారా అని పోసాని ప్రశ్నించారు. పవన్ ఇంకా ఎమ్మెల్యే, మంత్రి కూడా కాలేదని అప్పుడే దీక్ష చేయించి చంపేయించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. పవన్ ఆమరణదీక్ష చేయవద్దని పోసాని సూచించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పోసాని ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్‌పై పవన్ ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయరని చెప్పారు. పవన్ మళ్లీ సినిమాలు తీస్తానంటే తాను బ్లాంక్ చెక్ ఇస్తానని చెప్పారు. ఎన్ని సున్నాలు పెట్టుకున్నా పర్వాలేదన్నారు. 30, 40 కోట్ల రూపాయలైనా ఇస్తానన్నారు. దేశంలో పవన్‌కు అంత డిమాండ్ ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా విజయవాడలో ఆమరణ దీక్ష చేస్తే ప్రత్యేక హోదా దానికదే 30 రోజుల్లో వస్తుందన్నారు. అప్పటికీ హోదా రాకపోతే తనను రాళ్లతో కొట్టి చంపాలన్నారు.
షేర్ :
తాజా వార్తలు