మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

పవన్ కల్యాణ్ దొడ్డ మనసు.. దివ్యాంగుల టీ20 టోర్నీకి రూ.5 లక్షలు

Updated: 11-04-2018 08:01:14

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి తన దొడ్డ మనసును చాటుకున్నారు. దివ్యాంగుల టీ20 క్రికెట్‌కు రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులు, దివ్యాంగ క్రికెటర్లు పవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కాసేపు వారితో ముచ్చటించిన పవన్ అనంతరం మాట్లాడుతూ ప్రతిభకు వైకల్యం ఎంతమాత్రమూ అడ్డుకాదనే విషయాన్ని వీరు నిరూపిస్తున్నారని కొనియాడారు. వైకల్యాన్ని ఎదురించి ఆత్మస్థ్యైర్యంతో క్రీడల్లో పాల్గొని దివ్యాంగులందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారికి రూ.5 లక్షల సాయాన్ని అందించారు. ఈనెల 14 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో దివ్యాంగుల రెండో జాతీయ క్రికెట్ టోర్నీ జరగనుంది. 24 రాష్ట్రాల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.