పవన్ విమర్శలపై లెక్కలతో టీడీపీ కౌంటర్ అటాక్
Updated:
15-03-2018 01:35:48
అమరావతి: పవన్ విమర్శలపై లెక్కలతో టీడీపీ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు వల్ల ఒరిగిందేమీ లేదని అభిప్రాయపడింది. ఒంటరిగా పోటీ చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించామని టీడీపీ తెలిపింది. 2014 జడ్జీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 48 శాతం ఓట్లు వచ్చాయంది. 2014లో ఒంటరిగా పోటీ చేసినా 128 సీట్లు వచ్చి ఉండేవని టీడీపీ తెలిపింది. పవన్ నిన్న తన ప్రసంగంలో టీడీపీ పాలనపై దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లను టార్గెట్ చేశారు. నారా లోకేశ్‌కు శేఖర్ రెడ్డితో సంబంధాలున్నాయని ఆరోపించారు. దీంతో టీడీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. తమ నేతపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. 2014లో బిజెపి, జనసేన మద్దతుతోటే టీడీపీ అధికారంలోకి వచ్చిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పారు. టీడీపీకి వైసీపీకి కేవలం ఐదు లక్షల ఓట్లే తేడా అని జగన్ అనేకసార్లు చెప్పారు.