మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

ప్రభాస్ చేతుల మీదుగా క్రైమ్ థ్రిల్ల‌ర్  క్రైమ్‌ 23 ట్రైల‌ర్‌ లాంచ్‌

Updated: 13-04-2018 08:55:24

బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.  ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంలోనూ విల‌న్‌గా నటిస్తోన్న అరుణ్‌  విజయ్‌ ఇటీవ తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’.  ఈ చిత్రాన్ని  శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో  ప్రసాద్‌  ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘వైశాలి’ చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. మహిమ నంబియార్‌, అభినయ హీరోయిన్స్‌. శ్రీమతి అరుణ ప్రసాద్‌ ధర్మిరెడ్డి సమర్పణ. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ట్రైల‌ర్ లాంచ్ శుక్ర‌వారం హైద‌రాబాద్ లో ప్ర‌భాస్ చేతుల మీదుగా జ‌రిగింది.  

 

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ...``నా ఫ‌స్ట్ సినిమా `ఈశ్వ‌ర్‌` లో అరుణ్ విజ‌య్ సిస్ట‌ర్  శ్రీదేవి తో క‌లిసి న‌టించాను. ఇప్పుడు సాహోలో నేను విజ‌య్ క‌లిసి న‌టిస్తున్నాం. `క్రైమ్ 23` సినిమా ట్రైల‌ర్ చాలా బావుంది.  హీరోగా అరుణ్ విజ‌య్‌కు,  ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తోన్న నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.  

 

హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ...``నేను విల‌న్‌గా న‌టించిన బ్రూస్ లీ, ఎంత‌వాడుగాని చిత్రాలు తెలుగులో నాకు మంచి పేరు తెచ్చాయి. ప్ర‌స్తుతం నేను, మ‌ణిర‌త్నం గారి న‌వాబ్‌, ప్ర‌భాస్  `సాహో` చిత్రాల్లో న‌టిస్తున్నా. ఇటీవ‌ల నేను త‌మిళ్‌లో న‌టించిన ` కుట్ర‌మ్ 23` చిత్రం అక్క‌డ పెద్ద స‌క్సెస్ అయింది. `క్రైమ్ 23` పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. మెడిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. యాక్ష‌న్‌, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా ఆల్ ఎమోష‌న్స్ తో ద‌ర్శ‌కుడు అరివ‌ళ‌గ‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు. ప్ర‌తి ఇంట్లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను మా చిత్రంలో చూపించాం. క్రైమ్ 23 అంటే ఏంటో సినిమాలో చూస్తే అర్థ‌మ‌వుతుంది. నేను ఫ‌స్ట్ టైమ్ కాప్ గా న‌టించాను. అంత‌ర్లీనంగా ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంది. ప్ర‌భాస్ గారి చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంద‌న్నారు.

 

నిర్మాత ఇంద‌ర్ కుమార్ మాట్లాడుతూ...``ఈ చిత్రం త‌మిళంలో పెద్ద స‌క్సెస్ అయింది. తెలుగులో కూడా అదే విధంగా ఆడుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

 

మ‌రో నిర్మాత ప్ర‌సాద్ ధ‌ర్మిరెడ్డి మాట్లాడుతూ....‘‘తమిళనాడులో జరిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  చిత్రమిది. అక్క‌డ  భారీ వసూళ్లు రాబట్టుకొని విమర్శకుల‌ ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అరుణ్‌ విజయ్ కాప్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇందులో  మంచి మెసేజ్‌ తో పాటు ఆడియన్స్‌కు కావాల్సిన కమర్షియల్‌ హంగున్నీ ఉన్నాయి. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం.  విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌, భాస్కరన్‌ స్టైలిష్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మ‌మ్మ‌ల్ని న‌మ్మి తెలుగులో విడుద‌ల చేసే అవ‌కాశం క‌ల్పించిన అరుణ్ విజ‌య్ గారి ధ‌న్య‌వాదాలు. తెలుగులో వారితో ఒక స్ర్టెయిట్ మూవీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాం. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ప్ర‌భాస్ గారు ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

 

ద‌ర్శ‌కుడు అరివ‌ళ‌గ‌న్ మాట్లాడుతూ...`` వైశాలి తర్వాత తెలుగులో  విడుద‌ల‌వుతోన్న నా రెండో చిత్ర‌మిది. త‌మిళ్ లో క్రిటిక్స్ మంచి రివ్యూస్ రాశారు.అరుణ్ విజ‌య్ గారు కాప్ గా ఎక్సెలెంట్ ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచారు. మ‌ద‌ర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోష‌నల్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు మా   చిత్రాన్ని ఆదరిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం`` అన్నారు.  అరుణ్‌ విజయ్‌, మహిమ నంబియార్‌, అభినయ జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌, అరవింద్‌ ఆకాష్‌, వంశీకృష్ణ కీల‌కపాత్రల్లో నటించారు.   

 

ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌;సినిమాటోగ్రఫీ: కె.యమ్‌ భాస్కరన్‌; నిర్మాతలు:  ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు,  సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌; దర్శకత్వం: అరివళగన్‌.

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.