మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

29-04-2018 నుండి 05-05-2018 వరకు వారఫలాలు

Updated: 02-05-2018 01:53:50

మేషరాశి :  ఈవారంలో నూతన ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు రావడం వలన సంతోషాన్ని పొందుతారు. దూరప్రదేశంలో ఉన్న మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. కుటుంబంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, వీటివలన కుటుంబ సభ్యులు కాస్త నిరాశకు లోనయ్యే ఆస్కారం ఉంది. సముద్రతీర ప్రయాణం చేసే అవకాశం ఉంది , విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. చర్చాపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట వలన తప్పక మేలుజరుగుతుంది.
 
వృషభరాశి : ఈవారంలో మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారినుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది, తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు లభిస్తాయి. నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. బంధువులతో చేపట్టిన చర్చలు పెద్దగా ఫలితాలు ఇవ్వవు. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ద వహించుట మంచిది, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.
 
మిథునరాశి: ఈవారంలో సంతానపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులతో లేక బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో మీకంటూ ఒక స్పష్టమయిన ఆలోచన కలిగి ఉండుట మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయంలో ఒకింత ఒత్తిడి తప్పక పోవచ్చును. మీ మాటతీరు మూలన వివాదాలకు మీరే కేంద్రబిందువు అయ్యే అవకాశం ఉంది , కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన.
 
కర్కాటకరాశి :  ఈవారంలో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు,సాధ్యమైనంత  తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. గతంలో మీరు చేసిన పనులకు పెద్దలనుండి ప్రశంశలు లభిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో ఒత్తిడి తప్పక పోవచ్చును, కాస్త ఓపిక అవసరం. విలువైన వస్తువులను స్నేహితులకు ఇచ్చే ఆస్కారం కలదు. కుటుంబపరమైన విషయాల్లో అవతలి వారై అభిప్రాయాల మేర ముందుకు వెళ్ళుట ద్వారా నలుగురిని ఆకట్టుకుంటారు. 
 
సింహరాశి : ఈవారంలో స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది, ఈ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. పెద్దలతో మీకున్న పరిచయం మీకు సహాయపడుతుంది, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకుసాగుతాయి, కాస్త సంతోషాన్ని పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు  వ్యాపారంలో తీసుకొనే అవకాశం కలదు, ఆర్థికపరమైన లావాదేవీల్లో లబ్ధిని పొందుతారు. విదేశీప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం ఉంది. చర్చల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట వలన తప్పక మేలుజరుగుతుంది.
 
కన్యారాశి : ఈవారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న  విషయాలకు అధికప్రాధాన్యం ఇస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీకున్న పరిచయాలు బలపడుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. చర్చల్లో తక్కువగా పాల్గొనడం మంచిది.
 
తులారాశి: ఈవారంలో నూతన ఆలోచనలకు అలాగే నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మీ మాటతీరులో స్పష్టత ఉండకపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న చర్చల్లో సమయం గడుపుతారు. పెద్దలతో మీ ఆలోచనలను తెలియజేసి వారినుండి సహకారం పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గకపోవచ్చును. ఆరోగ్యం కొంత మెరుగు అయ్యే అవకాశం ఉంది. దూరప్రదేశం వెళ్ళుటకు ఆస్కారం ఉంది లేక బంధువులతో సమాయం గడుపుతారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పవల్సి వస్తుంది.
 
వృశ్చికరాశి : ఈవారంలో ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఈ సమయంలో కాస్త నిదానంగా వ్యవహరించుట మంచిది. చేపట్టిన పనులను ప్రణాళిక కలిగి ఉండి పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల వలన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ మాటతీరు సరిచేసుకోవడం వలన మరింత మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో చర్చలు చేస్తారు, వారినుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది.
 
ధనస్సురాశి: ఈవారంలో బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను సమయానికి పూర్తిచేస్తారు, పెద్దల సహకారంతో. రావాల్సిన ధనం చేతికి అందిన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం సూచన. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతూరు , వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం మేలు. కుటుంబంలో నూతన విలువైన వస్తువులను లేదా భూమిని కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.
 
మకరరాశి : ఈవారంలో ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశ ఉంది , వారినుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. గతంలో మీరు చేసిన పనులకు నలుగురిలో గుర్తింపును పొందుతారు. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. వాహనాల వలన ఇబ్బందులు లేదా ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచనలు మీ స్థాయిని దాటివెళ్ళుటకు అవకాశం ఉంది, కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం మేలు. వ్యాపారపరమైన విషయంలో బాగానే ఉంటుంది, నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం.
 
కుంభరాశి : ఈవారంలో దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్త్తిచేయుట సూచన. పెద్దలనుండి వచ్చిన సూచనలను అభిప్రయాలను పరిగణలోకి తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఖర్చులు పెరుగుట వలన ,వచ్చిన లబ్ది పెద్దగా మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చును. కుటుంబపరమైన  విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలను పెద్దలకు వదిలేయడం మంచిది. మిత్రులతో కాస్త విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది , జాగ్రత్త. మీ మాటతీరు మిమ్మల్ని నిలబెట్టు విధంగా ఉండేలా చూసుకోండి. పెద్దలతో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. గతంలో చేసిన తప్పులకు ఇబ్బంది పడతారు.
 
మీనరాశి : ఈవారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పనులను చేబట్టుట యందు తొందరపాటు వద్దు. ఆర్థికపరమైన విషయంలో బాగానే ఉన్నసంతృప్తి ఉండకాపోవచ్చును. పెద్దలతో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మొదలు పెట్టిన పనిలో వేగం పెరుగుతుంది. నూతన ఆలోచనలు మొదలు అవుతాయి, మిత్రులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబసభ్యుల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.
 
 
 
 
డా. టి. శ్రీకాంత్ 
వాగ్దేవిజ్యోతిషాలయం 
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559
 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.