వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించిన ఇద్దరు మహనీయులు
Updated:
30-04-2017 11:16:19
జై శ్రీమన్నారాయణ!!
వైశాఖ శుద్ధ పంచమి నాడు ఈ పవిత్ర భారతభూమిలో ఇద్దరు మహనీయులు జన్మించారు!!
ఒకరు అద్వైత సిద్ధాంత ప్రచారకులు
ఆది శంకరాచార్య భగవత్పాదులవారు!!
ఇంకొకరు విశిష్ఠాద్వైత సిద్ధాంత ప్రచారకులు
భగవద్రామానుజాచార్యులవారు!!
ఆది శంకరులు ఆవిర్భవించిన దాదాపు 1500 సంవత్సరాల తర్వాత భగవద్రామానుజుల వారు జన్మించారు!!
సరిగ్గా 2017 సంవత్సరానికి రామానుజా చార్యులు పుట్టి 1000 సంవత్సరాలు!!
ఈ సంవత్సరం వారి సహస్రాబ్ది ఉత్సవాలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి!!
శ్రీ రామానుజాచార్యులవారి జీవితంలో ఒక
ముఖ్య సంఘటన మనం స్మరించుకుందాం!!
వారి గురువుగారైన శ్రీ యాదవ ప్రకాశకులు
రామానుజులను చేరదీసి ప్రియశిష్యునిగా
స్వీకరించి శక్తివంతమైన ముక్తిదాయకమైన ఒక మంత్రరాజాన్ని ఉపదేశించి,ఇది ఎవరికి
చెప్పరాదు!! అత్యంత రహస్యమైనది!! ఇది
నా అనుజ్ఞ లేకుండా ఎవరికైనా చెబితే నీవు
" నరకానికి" పోతావు!! శ్రద్ధాభక్తులతో జపిస్తే
వైకుంఠధామానికి చేరుకుంటావు !! అని
బోధించాడు!!
సాధారణంగా మంత్రాలను రహస్యంగానే
వుంచాలి!! గురువుగారి ఆజ్ఞను ఎవరూ
దిక్కరించరాదు!! కానీ,
ఆనాటి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన శ్రీ రామా నుజులువారు గురువును దిక్కరించిన దోషానికి తనొక్కడు నరకానికి వెల్లినాపరవాలేదు తన తోటి ప్రజలు తరించ బడాలి! అని భావించి శ్రీరంగ ఆలయ గోపుర మెక్కి గట్టిగా ఉచ్ఛైస్వరముతో
#ఓంనమోనారాయణాయ#
అనే దివ్య మంత్రాన్ని వేల ప్రజలను ఉద్ధేశించి అందరికి వినబడేవిధంగా ప్రభోధించాడు!!
ఆనాడు మైకులు లౌడు స్పీకర్లు లేవు!!
మీ అందరికీ ఒక సీక్రెటు రహస్యం చెబుతా
అని వేలాదిమందిని కూడదీసి అందరికీ వినబడేలా గట్టిగా అరిచారు!!
అందరూ ఆశ్చర్యపోయారు!! రహస్యమైన గురువుల కృప వుంటేనేగాని లభ్యము కాని,
ఆ దివ్యమంత్రాన్ని వేలాదిమంది తన్మయంతో
సామూహికంగా ఏక కంఠముతోపులకించి
#ఓంనమోనారాయణాయ అని పలికారు!!
రామానుజులు తన జన్మ ధన్యమైనదిగా భావించారు!! ఎందుకంటే ఆ వేలాదిమందిలో
ఆలయ ప్రవేశానికి నోచుకోని ఎందరో
అభాగ్యులున్నారు!! అస్పృశ్యులున్నారు!!
విషయం గురువుగారికి తెలిసింది!! గురువు
ఆజ్ఞనే దిక్కరించావు!! నీవు నరకానికి
పోతావు!! అని కోపంతో మందలించారు!!
యాదవ ప్రకాశులవారు!!
" హే స్వామీ మీమాటను మీరినందుకు నేను నరకానికైనావెల్లడానికి సిద్ధం!! ఆలయ ప్రవేశానికి కూడా నోచుకోని వారందరూ "#నారాయణ#"శబ్దం చెవిలో పడినంతనే వారి వారి దుఃఖముల నుండి దూరమై తరిస్తారుకదా" నన్ను క్షమించండి అని వేడుకున్నాడు!!
గురువు గారు కరగిపోయి రామానుజులను అనుగ్రహించి సామాజిక సంస్కరణలకు పురికొల్పాడు!!
భగవద్రామానుజులవారు తను వయోవృద్ధు
లైన దశలో కావేరి నదీ స్నానానికి వెల్తూ
బ్రాహ్మణ శిష్యుల భుజాలపై చేయివేసి
నడచేవారు!!
కావేరీ నదీ స్నానాంతరం వారు అస్పృశ్యులు అనబడే శిష్యుల భుజాలపై చేయివేసుకుని ఆలయ ప్రవేశం చేసేవారట!!
ఎవరో అడిగారట?? ఏమిటి స్వామీ మీరు చేస్తున్నది?? దానికి వారు ఈ దేహం శుద్ధి
కావటానికి నేను బ్రాహ్మణశిష్యుల సహకారం
తీసుకుంటున్నాను!!
కాని నా మనస్సు శుద్ధి కావటానికి నేను వీరి సహకారము తీసుకుంటున్నాను !! అందరూ నా శిష్యులే కదా !! అని జవాబిచ్చారట!!
భగవద్రామానుజులను మించిన ఆదర్శవాది
సామాజిక సంఘ సంస్కర్త ఎవరైనావున్నారా!
వారి శ్రీచరణములకు నమస్కరిస్తూ వారి
సహస్ర జన్మశతాబ్ది శుభాకాంక్షలు!!
జై శ్రీమన్నారాయణ !! జయ శ్రీ రామ !!
--- సామర్ల వేంకటేశ్వరాచార్య!!, ఆధ్మాత్మికవేత్త, భాగ్యనగరం.