విళంబి నామ సంవత్సర ఆదాయ వ్యయాలు
Updated:
18-03-2018 01:52:32
శ్రీ విళంబి నామసంవత్సర ఫలితాలు ద్వాదశ రాశుల ఆదాయ,వ్యయ - రాజ్యపూజ,అవమానాలు
(అశ్వని 4 పాదాలు,భరణి 4 పాదాలు ,కృత్తిక 1 వ పాదాలు )
మేషరాశి : ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 05 అవమానం - 07
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు సప్తమ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా అష్టమంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు చతుర్థ,దశమంలో తదుపరి రాహువు త్రితీయా, కేతువు భాగ్య సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం భాగ్యస్థానములో సంచారం చేస్తున్నాడు.
మొదటి అర్ధభాగంలో గురు,శనుల వలన ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. గురు వీక్షణ రాశి పై ఉండటం వాలా పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. అక్టోబర్ 10 తర్వాత గురుడు అష్టమ సంచారం వలన ఉద్యోగంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెద్దలతో జాగ్రత్తగా వ్యవరించుట ఉత్తమం. సంవత్సరం మొత్తం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, వ్యాయామం చేయడం ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. రుణపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన రంగాల వారికి మిశ్రమ ఫలితాలు విద్యార్థులకు బాగానే ఉంటుంది. ద్వితీయార్థంలో మాత్రం విద్యార్థులు ఇబ్బంది పడుతారు.
అనునిత్యం గణపతి ఆరాధన అలాగే గణపతి అభిషేకం మంచిది , వేంకేటేశ్వర స్వామికి తులసి పూజ, సంవత్సరం మొత్తం శివాభిషేకం వీలైనప్పుడు చేసుకోవడం మంచిది.
(కృత్తికా 2,3,4,పాదాలు,రోహిణి 4 పదాలు,మృగశిర 1,2 పాదాలు )
వృషభరాశి : ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 03
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు షష్టమ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా సప్తమంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు తృతీయ,నవమంలో తదుపరి రాహువు త్రుతీయా, కేతువు అష్టమంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం అష్టమస్థానంలో సంచారం చేస్తున్నాడు.
మొదటి అర్ధభాగం దురు షష్ఠ సంచారం శని అష్టమ సంచారం వలన ఒత్తడికి గురయ్యే అవకాశం ఉంది. రాహువు తృతీయ సంచారం అనుకూలంగా ఉంది. చేపట్టు పనుల విషయంలో శ్రద్ద అవసరం. అక్టోబర్ నుండి పని ఒత్తిడి ఉన్న ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఈ రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. విద్యార్థులకు శ్రమతప్పదు , మిశ్రమ ఫలితాలు వస్తాయి. కష్టానికి తగిన ఫలితం మాత్రం పొందుతారు.
హనుమాన్ ఆలయం దర్శనం, శనివారాలు హనుమాన్ కి ఆకుపూజ, అలాగే శనికి తైలాభిషేకం మంచిది. ప్రతిరోజు సుబ్రమణ్య ఆరాధన ఉత్తమం. దుర్గాదేవి ఆరాధనా మంచిది.
(మృగశిర 3,4 పాదాలు,ఆరుద్ర 4 పాదాలు ,పునర్వసు 1,2,3 పాదాలు )
మిథునరాశి: ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 04 అవమానాం - 03
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు పంచమ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా షష్ఠమంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు ద్వీతీయ,అష్టమంలో తదుపరి రాహువు ద్వీతీయా, కేతువు సప్తమంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం సప్తమస్థానంలో సంచారం చేస్తున్నాడు.
గురు, శనుల చక్కటి ద్రుష్టి ఉండటం వలన మొదటి అర్ధభాగం చక్కగా గడిచి పోతుంది. కొద్దిపాటు కష్టం ద్వారా ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. సంతానం విషయాల్లో కీలకమైన ఆలోచనలు అలాగే మార్పులు కలుగుతాయి. ద్వితీయ అర్ధభాగంలో గురుడు షష్టమ సంచారం వలన రుణపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కాస్త జాగ్రత్త పెంచుట మేలు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. సమయాన్ని మరింతగా ఉపయోగించుకోవడం వలన ఉన్నతమైన ఫలితాలు పొందుతారు, విజయం సాధిస్తారు. ఉన్నతమైన ఫలితాల కోసం దుర్గాదేవి ఆరాధన, సహస్రనామ అర్చన అలాగే వేంకటేశ్వర దేవాలయ దర్శనం మంచిది. ప్రతిరోజు ఆంజనేయ ప్రార్థన మంచిది.
(పునర్వసు 4 వపాదం,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు )
కర్కాటకరాశి : ఆదాయం - 08 వ్యయం - 02 రాజపూజ్యం - 07 అవమానం - 03
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు చతుర్థ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా పంచమంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు రాశిలో, సప్తమంలో తదుపరి రాహువు వ్యయంలో, కేతువు షష్ఠమంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం షష్ఠమ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం బాగానే ఉన్న పూర్తిస్థాయి సంతృప్తి ఉండక పోవచ్చును. పెద్దలతో మీకున్న పరిచయాలు మరింతగా బలపడుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. స్థిరాస్తిపరంగా కొనుగోలు చేస్తారు, నూతన గృహప్రవేశ అవకాశాలు కలవు. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వారితో కలిసి నూతన వ్యాపార ప్రయత్నాలు మొదలు పెడతారు.
మొదటి అర్ధభాగంలో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సరదాగా గడపడానికి ఇష్టపడుతారు. అనుకోని ఖర్చులకు అవాకాశం ఉంది. వ్యాపార ప్రయత్నాలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ద్వితీయ అర్ధభాగంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఫలితాలు సంతృప్తి కరంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న బంధువులు లేక మిత్రులనుండి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఉన్న వివాదాలు సద్దుమనుగుతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగావుంది, కొద్దిగా కష్టపడటం ద్వారా మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది.
మరింతగా ఫలితాలు పొందుటకు సుబ్రమణ్య ఆరాధన, రాఘవేంద్ర ఆరాధన చేయడం మంచిది. ప్రతిరోజు సుబ్రమణ్య అష్టకం చదవడం మంచిది.
(మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
సింహరాశి : ఆదాయం - 11 వ్యయం - 11 రాజపూజ్యం - 03 అవమానం - 06
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు తృతీయ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా చతుర్థమంలో సంచారం , రాహువు, కేతువు లు 07-03-2019 వరకు వ్యయంలో,షష్టమంలో తదుపరి రాహువు రాశిలో, కేతువు పంచమంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం పంచమస్థానంలో సంచారం చేస్తున్నాడు.
గురు,శనుల ద్రుష్టి సంచారం సరిగా లేదు చేపట్టు పనుల విషయంలో స్పస్టత అవసరం. తొందరపాటు పనికిరాదు. అధికారులతో లేక పెద్దలతో మాట పట్టింపులకు వెళ్ళకండి. కుటుంబ పరమైన విషయాల్లో ఒత్తిడి అలాగే ఇబ్బందులు తప్పకపోవచ్చును. రుణపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మాత్రం బాగానే ఉంటుంది. సంతానం వలన నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ద్వితీయ అర్ధభాగం బాగాఉంటుంది , కొంత ఊరట పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. విదేర్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రణాళిక అవసరం. ఉన్నతమైన ఫలితాల కోసం , ప్రతిరోజు రాత్రి చంద్రదర్శనం మంచిది, దక్షిణామూర్తి ఆరాధన, స్తోత్రం చదవడం మంచిది. వీలైనప్పుడు శివాభిషేకం మేలుచేస్తుంది. గణపతి ఆలయం దర్శనం మంచిది.
(ఉత్తర 2,3,4 పాదాలు ,హస్త 4 పాదాలు, చిత్త 1,2 పాదాలు )
కన్యారాశి : ఆదాయం - 04 వ్యయం - 02 రాజపూజ్యం - 06 అవమానం - 06
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు ద్వితీయ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా తృతీయంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు ఏకాదశ ,పంచమంలో తదుపరి రాహువు దశమ, కేతువ చతుర్థమంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం చతుర్థస్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం బాగాఉంటుంది గతం కన్నా సంవత్సరం బాగుంటుంది. విదేశీప్రయాణాలు చేయాలనుకొనే వారికి అనుకూలమైన కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కీలకమైన ఆలోచనలు లేక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. పెద్దలతో పరిచయాలకు అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
ప్రథమ అర్ధభాగం నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నను దానికి సరిపడా సంపాదన ఉంటుంది. ద్వితీయ అర్ధభాగంలో సోదరులతో విభేదాలు వచ్చుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. కుటుంబంలో పెద్దలకు అనుగుణంగా నడుచుకోండి. మంచి ఫలితాల కోసం దుర్గాదేవి ఆరాధన , హనుమాన్ ఆలయ దర్శనం మంచిది, ప్రతిరోజు విష్ణుసహస్రనామ పారాయణ మంచిది . తరుచు దత్తాత్రేయ సందర్శన మంచిది.
(చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు,విశాఖ 1,2,3 పాదాలు )
తులారాశి: ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 02
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు సొంత స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా ద్వితీయంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు దశమంలో,చతుర్థములో తదుపరి రాహువు నవమం, కేతువు తృతీయంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం తృతీయం స్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని విషయాల్లో నిదానంగా లేకపోతే , సర్దుబాటు విధానం కలిగి ఉండకపోతే ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉంది. పెద్దలతో విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది. వాటికి అవకాశం ఇవ్వకండి. కుటుంబంలో అనుకోకుండా విభేదాలు పొడచూపుతాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వకపోవచ్చును.
మొదటి అర్ధభాగం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, సాధ్యమైనంత మేర ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకపోవడం మంచిది. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ద్వితీయ అర్ధభాగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొంత ఊరట చెందుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తల్లి,తండ్రులతో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. మంచి ఫలితాల కోసం లక్ష్మీనరసింహా ఆరాధన , ప్రతిరోజు నారసింహా కవచం చదవండి. హనుమాన్ ఆలయం దర్శనం మంచిది
గణపతి అభిషేకం మంచిది.
(విశాఖ 4వ పాదం ,అనురాధ 4 పాదాలు , జ్యేష్ఠ 04పాదాలు )
వృశ్చికరాశి : ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 05 అవమానం - 02
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు వ్యయస్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా రాశిలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు నవమంలో,త్రుతీయంలో తదుపరి రాహువు అష్టమం, కేతువు ద్వితీయరాశిలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం ముఖ్యమైన పనులను వాయిదా వేయుట మంచిది. ఉద్యోగంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, కార్య క్షేత్రంలో పని ఒత్తిడి ఉంటుంది. చేసిన పనినే మల్లి మల్లి చేయవల్సి రావోచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది , జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. పెద్దగా ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి రాకపోవచ్చును.
మొదటి అర్ధభాగం ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో కొత్త కొత్త సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. ద్వితీయ భాగంలో బాగాఉంటుంది. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఉన్నతమైన ఫలితాల కోసం వేంకటేస్వర కళ్యాణం చేయించుట మంచిది, తరుచు గణపతి ఆలయం దర్శనం చేయండి. ప్రతిరోజు శివారాధన మేలు.
(మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు ,ఉత్తరాషాఢ 1వపాదం )
ధనస్సురాశి: ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 05
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు ఏకాదశ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా వ్యయంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు అష్టమంలో,ద్వితీయంలో తదుపరి రాహువు సప్తమం, కేతువు రాశిలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం రాశిలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి పేరును పొందుతారు. గతంలో మీకు రావాల్సినవి వస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారరంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం . కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. మీ మాటతీరు విషయంలో కాస్త సరిచూసుకోవడం ఉత్తమం, లేకపోతే ఆత్మీయులను కోల్పోయే అవకాశం ఉంది , జాగ్రత్త.
మొదటి అర్ధభాగం ఉన్నతమైన వారిని కలుస్తారు, వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగాఉంటుంది. పుణ్యఖేత్ర దర్శనం చేసుకొనే అవాక్షం ఉంది. ద్వితీయ భాగంలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచితం. మీ అనుకున్న వారినుండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మంచి ఫలితాల కోసం ప్రతిరోజు శివరాధన, దుర్గాస్తోత్రమ్ చదవడం మంచిది. గోమాత ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు సూర్యనమస్కారం ఉత్తమం.
(ఉత్తరాషాడ 2,3,4పాదాలు ,శ్రవణం 4 పాదాలు ,ధనిష్ఠ 1,2 పాదాలు )
మకరరాశి : ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 04 అవమానం - 05
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు దశమ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా ఏకాదశ స్థానంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు సప్తమంలో,రాశిలో తదుపరి రాహువు షష్టమం, కేతువు వ్యయంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు . ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట ఉత్తమం. మానసికంగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటిమూలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరులతో చర్చలకు అవకాశం ఇవ్వకండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చును. కొంత వేచిచూసే ధొరణి మేలుచేస్తుంది.
మొదటి భాగం లో కొంత ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలను వాడుకొనే ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో పెద్దలనుండి సహకారం లభిస్తుంది. ద్వితీయ అర్ధభాగంలో బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించినమేర సహకారం లభిస్తుంది. పని ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉన్నతమైన ఫలితాల కోసం సరస్వతీ ధ్యానం, గణపతి ఆరాధన మంచిది. వీలైనప్పుడు వేంకటేశ్వర ఆలయం దర్శనం మంచిది. సుబ్రమణ్య అభేషేకం మేలు.
(ధనిష్టా 3,4 పాదాలు,శతభిషం 4 పాదాలు,పూర్వభాద్రపద 1,2,3 పాదాలు )
కుంభరాశి : ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 07 అవమానం - 05
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు నవమ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా దశమ స్థానంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు షష్ఠమంలో,వ్యయంలో తదుపరి రాహువు పంచమం, కేతువు ఏకాదశంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం ఫలితాల కన్నా చెపుతూ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. స్వా ప్రయోజనాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, జీవితభాగస్వామితో సర్దుబాటు విధానం అన్నివిధాలా మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీయానం చేయుటకు ఆస్కారం ఉంది.
మొదటి అర్ధభాగంలో అయిదోగంలో పని ఒత్తిడి ఉంటుంది. నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపార పరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుటరు. ద్వితీయ అర్ధభాగంలో దూరద్రుష్టిని కలిగి ఉండి ముందుకు వెళ్లడం మేలు. పెద్దలతో చర్చలకు అవకాశము ఉంది. గతంలో మీకు రావాల్సిన అవకాశాలు పొందుతారు. ఉన్నతమైన ఫలితాల కోసం శ్రీరామదేవాలయ దర్శనమ్ , హనుమాన్ పూజ, ప్రతోరోజు లలితా సహస్రనామం పారాయణం మంచిది. గోమాత పూజ మంచిది.
(పూర్వభాద్రపద 4వపాదం,ఉత్తరాభాద్రపద 4 పాదాలు ,రేవతి 4 పాదాలు )
మీనరాశి : ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 03 అవమానం - 01
ఈ రాశివారికి గురుడు 10-10-2018 వరకు అష్టమ స్థానమైన తులలో సంచారం తదుపరి సంవత్సర మంతా నవమ స్థానంలో సంచారం , రాహువు,కేతువు లు 07-03-2019 వరకు పంచమంలో,ఏకాదశంలో తదుపరి రాహువు చతుర్థమం, కేతువు దశమంలో సంచారం చేస్తున్నారు. శని సంవత్సరం మొత్తం ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఈ సంవత్సరం నూతన అవకాశాల కోసం చేసిన ప్రయాత్నాలు ముందుకు సాగుతాయి. పెద్దలతో పరిచయాలకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమం జరుగుటకు అవాకాశం ఉంది. సంతానం విషయంలో ఒకింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.
మొదటి అర్ధభాగంలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది , జాగ్రత్త. కళారంగంలో ఉన్న వారికి పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులకు నిరాశే మిగులుతుంది. ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును. ద్వితీయ అర్ధభాగంలో బాగుంటుంది , నూతన అవకాశాలు లభిస్తాయి. పెద్దలతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉన్నతమైన ఫలితాలా కోసం లక్షీగణపతి ఆరాధన , హనుమాన్ ఆలయం దర్శనం మంచిది. శ్రీరామరక్షా స్తోత్రం చదవడం మంచిది. సుబ్రమణ్య అభిషేకం మంచిది.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559