మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

సంపూర్ణ చంద్రగ్రహణం.. అరిష్టమా, అదృష్టమా?

Updated: 31-01-2018 03:18:57

నేడు ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5:18 నుంచి 8:41 వరకూ చంద్ర గ్రహణం ఉంటుంది. మరోవైపు కర్కాటక రాశివారికి చంద్రగ్రహణం వల్ల అరిష్టమని, పిల్లలు, గర్భిణులు బయటకు రావద్దని పండితులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో తినరాదని కూడా చెబుతున్నారు. చంద్రగ్రహణం అరిష్టమని వారంటున్నారు. అయితే వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. నేటి సంపూర్ణ చంద్ర గ్రహణం ఖగోళంలో అద్భుతమంటున్నారు. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంతో సహా అన్ని దేవాలయాలను ఉదయాన్నే మూసివేశారు. తిరిగి రాత్రి 11 గంటల తర్వాత తెరుస్తారు. సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.