మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

డీల్ క్యాన్సిల్ ఇక...

Updated: 08-04-2017 06:14:15

తన ఖరీదైన కారుని తీసుకుని సుధీర్ పెద్ద షాపింగ్ మాల్‌కి వచ్చాడు. కాని అక్కడ కార్ పార్క్ చేయడానికి ఎక్కడా స్థలం కనిపించలేదు. పార్కింగ్ స్థలం కోసం అటూ ఇటూ చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. కాని ఫలితం శూన్యం. విసుగొచ్చి సుధీర్ ఆకాశం వైపు చూసి దేవుడిని ఇలా ప్రార్థించాడు, "స్వామీ! నాపై దయ చూపించు. నాకిప్పుడు అర్జెంట్‌గా పార్కింగ్ ప్లేస్ చూపిస్తే...నేను ఇప్పటినుండి ప్రతీ వారం గుడికి వచ్చి నీ సేవ చేసుకుంటాను. ఆల్కహాల్...సిగరెట్టు అస్సలే ముట్టను."
 
అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అలా ప్రార్థించాడో లేదో కాని దేవుడు వెంటనే సుధీర్ కోసం ఒక ఖాళీ స్థలం ప్రత్యేకంగా సృష్టించాడు. ఇంతలో కార్ పార్కింగ్ కోసం చూస్తున్న సుధీర్‌కు ఆ ఖాళీ స్థలం కనిపించగానే, "దేవుడా డీల్ క్యాన్సిల్. నాకు ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కనిపించింది. నీ అవసరం లేదు కనుక మన డీల్ కూడా క్యాన్సిల్," అంటూ తన కార్‌ని పార్క్ చేయడానికి అటువైపు కారు తిప్పాడు.
 
మనుషులు ఎంత చంచల మనస్థత్వం కలవారు! తమ అవసరాలు తీర్చుకోవలసి వచ్చినప్పుడు దేవుడి అండ కోరుకుంటారు. అవి తీరిపోయే మార్గం దేవుడే సృష్టించాడనే నిజాన్ని మరచిపోయి అంతా తన అదృష్టం వలన పనులు జరిగిపోయాయని అనుకుంటాడు. సౌకర్యంగా తనకు అనువైన వాదన ఏర్పరచుకుంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మన ప్రార్థనలు విన్న భగవంతుడు తాను స్వయంగా అగుపించకపోయినా, ఆ కష్టాలు తీరే మార్గం అతనే సృష్టించాడనే ఎరుక కలిగిన మనిషే సత్‌శీలి. --RAMANI

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.