మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న దాచేపల్లి నిందితుడు

Updated: 04-05-2018 01:13:51

గుంటూరు: గురజాల మండలం దైద వద్ద సుబ్బయ్య ఆచూకీ లభ్యమైంది. దైదకు సమీపంలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో సుబ్బయ్య ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న సుబ్బయ్య కోసం ఏపీ, తెలంగాణలో అనేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. దాచేపల్లి ఘటనపై ఏపీలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో దాచేపల్లి ఘటన కీలకంగా మారడంతో నిందితుడిని పట్టుకోవాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. అత్యాచారం తర్వాత దాచేపల్లి నుంచి పరారైన సుబ్బయ్య చనిపోతానని ఫోన్ ద్వారా బంధువులకు ఇప్పటికే స్పష్టం చేయడంతో ఆత్మహత్య చేసుకున్నది అతడేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బంధువుల సాయంతో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని సమాచారం. పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.