మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

పవన్ సంచలన నిర్ణయం

Updated: 18-04-2018 11:35:58

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన 2+2 గన్‌మెన్‌లను వెనక్కు పంపారు. సెక్యూరిటీ పేరుతో తనకు గన్‌మెన్‌లను కేటాయించి తనపై నిఘా పెడుతున్నారని ఆయన అనుమానిస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలు లీక్ అవుతున్నాయని అనుమానిస్తూ గన్‌మెన్‌లను వెనక్కు పంపారు. రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దిగాలని పవన్ యోచిస్తున్నారు. ఏపీలో ప్రధానంగా దృష్టి సారించారు. వామపక్షాలతో కలిసి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తున్నారు. 2014 సమయంలో పవన్ టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. ప్రస్తుతం సిపిఐ, సిపిఎంలతో కలిసి అడుగులేస్తున్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.