మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

కర్ణాటక ఎన్నికల బరిలో గాలి.. బీజేపీ అభ్యర్థిగా పోటీ!

Updated: 28-03-2018 06:49:10

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల బరిలోకి ప్రముఖ వ్యాపారవేత్త, అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు అయిన గాలి జనార్దన్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మే 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 15న ఫలితాలు విడుదల కానున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు అటు అధికార కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ రెండు పార్టీలు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా మారగా, ఇప్పుడు ‘గాలి’ బరిలోకి దిగనున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
మేలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి నుంచి బరిలోకి దిగనున్నట్టు ఆయన సోదరుడు సోమశేఖరరెడ్డి చెప్పినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ నుంచి కానీ, జనార్దన్‌రెడ్డి  నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు.   

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.