Updated: 20-03-2018 11:18:23
హైదరాబాద్: మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనారాయణపురం సాయిప్రభు కాలనీలో దారుణం జరిగింది. భార్య వరలక్ష్మిని, ఇద్దరు పిల్లలను భర్త సురేందర్ హత్య చేశాడు. చిన్నారుల్లో నితీశ్ వయసు ఐదేళ్లు కాగా, యశస్విని వయసు మూడేళ్లు. హత్యలు చేశాక సురేందర్ పోలీసులకు లొంగిపోయాడు. సురేందర్‌ది లింగంపల్లి కాగా రాత్రి అత్తారింటికి వచ్చాడు. అత్త ఊరెళ్లడంతో పొద్దున్నే మామను, బావమరిదిని కల్లు తెమ్మని బయటకు పంపాడు. వాళ్లు తిరిగి వచ్చేసరికే పిల్లలు, వరలక్ష్మి అపస్మారక స్థితిలో ఉండటంతో వారిని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాలే కారణమయ్యుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనతో మీర్‌పేటలో కలకలం రేగింది.
షేర్ :
తాజా వార్తలు