అమిత్ షాపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Updated:
25-03-2018 01:10:27
అమరావతి: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటోన్న షా తన కుమారుడు జయేష్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించాలని చంద్రబాబు కోరారు. పార్టీ నేతలు, ఎంపీలతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపైన, తన ప్రభుత్వంపైన అవినీతి ఆరోపణలు చేస్తారా అని చంద్రబాబు ఊగిపోయారు. యూపీ రాజ్యసభ ఎన్నికల్లో విలువలకు బిజెపి పాతరేసిందని చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్‌లో రాజ్యసభ సీటు కోసం కేంద్రం సిబిఐ, ఈడీలతో పాటు పలు కేంద్ర సంస్థలను ఉపయోగించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమిత్ షా లేఖపై చంద్రబాబు కన్నెర్ర చేసి ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అటు సోము వీర్రాజు చేసిన అవినీతి ఆరోపణలపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. అందుకే నేరుగా అమిత్ షా కుమారుడిపై అవినీతి ఆరోపణలు చేశారు. అమిత్ షా కుమారుడు 50 వేల రూపాయల పెట్టుబడితో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని చంద్రబాబు ప్రశ్నించి బిజెపి అధిష్టానాన్ని షాక్‌కు గురిచేశారు.