మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత సంచలన లేఖ

Updated: 22-04-2018 09:16:50

విజయవాడ: టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలిగా నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం తనకు ఇష్టం లేదని పేర్కొన్న అనిత తాను క్రిస్టియన్‌ను కాదని మరోమారు స్పష్టం చేశారు. తన ఇష్టదైవం తిరుమల వెంకన్నేనని, తాను ఎన్నోసార్లు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు. 
 
అనితను టీటీడీ సభ్యురాలిగా ప్రభుత్వం నియమించిన వెంటనే.. గతంలో అనిత ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అయింది. అందులో తాను క్రిస్టియన్‌ను అని, తన బ్యాగులో ఒకటి, కారులో ఒక బైబిల్ ఎప్పుడూ ఉంటాయని అందులో పేర్కొన్నారు. దీంతో పెను దుమారమే రేగింది. ఓ క్రిస్టియన్‌ను టీటీడీ సభ్యురాలిగా నియమించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దీంతో స్పందించిన అనిత చంద్రబాబుకు లేఖ రాస్తూ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.