మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

ఆనం వివేకానంద రెడ్డి కన్నుమూత

Updated: 25-04-2018 10:22:27

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి(67) కన్నుమూశారు. అనారోగ్యంతో నెలరోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనం ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల్లూరులో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆనం వివేకానందను ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు.  1950 డిసెంబర్ 25న జన్మించిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనం వివేకానందకు ఇద్దరు కుమారులున్నారు. ఆనం సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.