ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యత రాఘవేంద్రరావుదే!
Updated:
26-04-2018 12:51:22
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తీస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. తాను సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోవచ్చనే అనుమానంతో ఆయన వెనుకడుగు వేశారు. దీంతో సినిమాకు దర్శకత్వ బాధ్యతలు కే.రాఘవేంద్రరావుకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌తో అనేక హిట్ చిత్రాలు తీసిన రాఘవేంద్రరావే బయోపిక్‌కు న్యాయం చేయగలరని తేజ కూడా భావిస్తున్నారు. మరోవైపు సినిమాకు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని సినీరంగానికి చెందిన కొందరు ప్రముఖులు సూచిస్తున్నారు.