మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

మంత్రముగ్ధులను చేసిన చిన్నారుల నృత్యాలు

Updated: 04-05-2018 12:18:25

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని తులసివనం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. మణికొండ శ్రీ నృసింహ కూచిపుడి నాట్య భారతి నృత్య పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కూచిపుడి నృత్య గురువు ఆకుల శ్రీనివాస్ శిక్షణలో చిన్నారులు తమ కళా రూపాలను అద్భుతంగా ప్రదర్శించారు. చిన్నారులు  హేమన్య, యశస్విని, కుందన్, కుందన, అర్చన తదితరుల నృత్య రీతులు చూపరులను కట్టిపడేశాయి. మూడు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమాలకు భక్తులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.