మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

జనసేన సభలో తొక్కిసలాట.. ఇద్దరి పరిస్థితి విషమం

Updated: 14-03-2018 06:46:02

అమరావతి: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది కార్యకర్తలు అస్వస్థతకు గురికాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పోలీసులు కూడా ఉన్నారు. అభిమానులు అత్యుత్సాహంలో ముందు గ్యాలరీలోకి జనసేనే మహిళా కార్యకర్తలు తోసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒక్కసారిగా తోసుకురావడంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అభిమానులను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.  
 
జనసేన ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభా ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకారులు స్ఫూర్తి నింపే పాటలను ఆలపించారు. లక్షలామంది అభిమానులు తరలివచ్చిన ఈ సభలో జనసేన అధినేత పవన్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.