పవన్ వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ ఏమన్నారంటే!
Updated:
17-03-2018 01:54:23
హిందూపురం: తన అల్లుడు నారా లోకేశ్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై తొలుత నో కామెంట్ అన్నారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించి అతడిని హీరోను చేయలేనన్నారు. తానే సూపర్ హీరోనని చెప్పారు. అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. గుంటూరు సభలో పవన్ నారా లోకేశ్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. శేఖర్ రెడ్డి కేసులో లోకేశ్‌కు ప్రమేయం ఉందని పవన్ ఆరోపించారు. లోకేశ్ అవినీతి కనపడటం లేదా అని సిఎం చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పుట్టింది. టీడీపీ భగ్గుమంది. టీడీపీ నేతలు పవన్‌పై ఒక్కసారిగా విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పవన్ విమర్శలపై నారా లోకేశ్ మామ నందమూరి బాలకృష్ణ స్పందించారు. కామెంట్ చేసి పవన్‌ను హీరోగా చేయలేనని, తానే సూపర్ హీరోనని బాలకృష్ణ చెప్పారు. పవన్ అనంతపురం నుంచి పోటీ చేస్తారట కదా అని ఇటీవలే విలేకరులు అడిగితే పవన్ కళ్యాణ్ ఎవరు అని బాలకృష్ణ తిరిగి ప్రశ్నించినట్లు సమాచారం.