మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

ష్.. సైలెన్స్ చిత్రం ప్రారంభం

Updated: 04-05-2018 11:36:02

నాగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిషన్, డానియల్, సుమ హీరోహీరోయిన్లుగా రంజిత్ కుమార్ దర్శకత్వంలో వి. రమణబాబు, డానియల్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఎంటర్టైనర్ 'ష్.. సైలెన్స్'. చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ కొత్తగా, దర్శకుడు సముద్ర కెమెరా స్విచాన్ చేశారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి. రమణబాబు మాట్లాడుతూ.. " ఇదొక వెరైటీ సబ్జెక్టు. ఈ కథ నచ్చడంతో సినిమా నిర్మాణం ప్రారంభించాం. మే ద్వితీయార్ధంలో చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం.. " అన్నారు. 
 
హీరో కిషన్ మాట్లాడుతూ.. "ఈ చిత్రం ద్వారా హీరోగా ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను. ఈ చిత్రం డెఫినెట్ గా నాకు మంచి పేరు, గుర్తింపు ఇస్తుంది.." అన్నారు. 
 
మరో హీరో డానియల్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోగా కీ రోల్ పోషిస్తున్నాను. ఈ చిత్రం మా యూనిట్ కి మంచి పేరు తెస్తుంది.. అన్నారు. 
 
కిషన్, సుమ, డానియల్, విక్కీ, బులెట్ సుధాకర్, బళ్లారి బాబు, రమేష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవేందర్, కెమెరా: ఏ. విజయ్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ : డేవిడ్, ప్రొడక్షన్ : మంగారావు, నిర్మాతలు: వి. రమణ బాబు, డానియల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రంజిత్ కుమార్.  

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.