అనువంశికత ఆడియో ఆవిష్కరణ
Updated:
12-03-2018 01:53:13
సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే జంటగా కౌండిన్య మూవీస్ పతాకంపై రమేష్ ముక్కెర దర్శకత్వంలో తాళ్లపెల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ` `అనువంశికత`. `జెనిటిక్ లవ్ స్టోరీ` అనేది ఉపశీర్షిక . అశ్విత, క్రాంతి కుమార్ సమర్పకులు. సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, `రక్త సంబంధీకులను పెళ్లి చేసుకుంటే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనే పాయింట్ ను ఆధారంగా చేసుకుని దర్శకుడు చక్కగా సినిమా చేశాడు. మంచి సందేశాత్మక చిత్రమిది. పాటల్లో కూడా మంచి సందేశం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని మళ్లీ రీ షూట్ కూడా చేశారు. అంటే దర్శక, నిర్మాతలకు సినిమా పట్ల ఎంత ఫ్యాషన్ ఉందో అర్ధమవుతోంది. బడ్జెట్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా బాగా వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుంది` అని అన్నారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, `సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడి దామోదర్ సినిమా చేశారు. పాటలు బాగున్నాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది` అని అన్నారు.
చిత్ర నిర్మాత తాళ్ల పెల్లి దామోదర్ గౌడ్ మాట్లాడుతూ, ` మంచి కథాశం. సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మా తొలి ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆదరిస్తారని ఆశిస్తున్నా`అన్నారు.
చిత్ర దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ, ` ఈ బ్యానర్లో తొలి సినిమా ఇది. సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. 45 డిగ్రీల వేడిని సైతం లెక్క చేయకుండా షూటింగ్ చేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి సహాకరం అందించారు. నిర్మాత నేను అడిగిందల్లా కాదనకుండా సమకూర్చారు. అందువల్లే ఇంత మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాను. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయి` అని అన్నారు.
హీరో సంతోష్ రాజ్ మాట్లాడుతూ, ` సుమన్ గారితో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. యాక్టింగ్ పరంగా ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నిర్మాత మాటీ మ్ అందర్నీ నమ్మి సినిమా చేశారు. ఆయన నమ్మకం నిలబెడతుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
హీరోయిన్ నేహాదేశ్ పాండే మాట్లాడుతూ, ` సుమన్ గారు డాటర్ పాత్రలో కనిపిస్తాను. ఆయనతో పనిచేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు` అని అన్నారు.
గీత రచయిత తైదల బాపు మాట్లాడుతూ, ` వరంగల్ హన్మకొండలో లక్షలాది మంది సమక్షంలో టీజర్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఇంత మంది సమక్షంలో ఆడియో ఘనంగా జరిగింది. పాటలన్నీ సందర్భాను సారంగా ఉంటాయి. ఇప్పటివరకూ 400 పాటలు రచించారు. అందులో ఈ సినిమా కోసం రాసిన పాట ఒకటుంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
ఈ వేడుకలో కొత్త మనోహర్ రెడ్డి, సమ్మయ్య, రాధాకృష్ణ, అనీల్, విజయలక్ష్మి, రజీయా బేగం తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలో పావని, చమ్మక్ చంద్ర, గౌతం రాజు, ఫిష్ వెంకట్, ఆనంద్ భారతి, ముత్యాల శ్రీను, రాజమౌళి జబర్దస్త్, తిలక్, యమ్.డి. యాకూబ్, పూజకసేకర్, దామోదర్, రమణారెడ్డి, ప్రత్యేక పాత్రల్లో బూర నర్సయ్య గౌడ్( యమ్.పి భువనగిరి), రాకేష్ మిశ్రా( సి.సి.యమ్.బి), లింగరాజు, లక్ష్మీ కందుకూరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: సతీష్, డ్యాన్స్: త‌్రిపాల్, ఎడిటింగ్: డి.విఎస్ . ప్రభు, కళ : విజయకృష్ణ (నంది అవార్డు గ్రహీత), పాటలు: చంద్రబోస్, తైదల బాపు, కందకట్ల రామకృష్ణ, రమేష్ ముక్కెర, సహనిర్మాత: యండి. యాకూబ్, కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం: రమేష్ ముక్కెర, నిర్మాత : తాళ్లపెలలి దామోదర్ గౌడ్.