మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

భరత్‌ అనే నేను మూడో పాటకు అనూహ్య స్పందన

Updated: 07-04-2018 10:08:40

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను గురువారం విడుదల చేశారు. 'వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి.. ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ' అంటూ రామజోగయ్యశాస్త్రి రాసిన పాటను కైలాష్‌ ఖేర్‌, దివ్యకుమార్‌ ఆలపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 
 
సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ల తోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.
 
మరోవైపు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షలాది మంది అభిమానులు ఇప్పటికే ఈ పాటను చూసేశారు. 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.