మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

48 గంటల్లోనే జైలు నుంచి విడుదలైన సల్మాన్

Updated: 07-04-2018 06:12:30

48 గంటల్లోనే జైలు నుంచి విడుదలైన సల్మాన్ జోథ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో అరెస్టై జోథ్‌పూర్ జైళ్లో 48 గంటలు అయిందో లేదో సల్మాన్‌కు బెయిల్ వచ్చేసింది. అయితే అనుమతి లేనిదే విదేశాలకు వెళ్లొద్దని న్యాయస్థానం షరతులు విధించింది. 50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించింది. దీంతో అతడు జైలు నుంచి విడుదలై జోథ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబై చేరుకుంటాడు. ఈ నెల ఐదున కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చడమే కాకుండా ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. మిగతా నిందితులైన సైఫ్ అలీ ఖాన్, టబు, సొనాలి బింద్రే నీలంలను నిర్దోషులుగా ప్రకటించింది. సల్మాన్‌కు రెండ్రోజుల్లోనే బెయిల్ రావడంపై పెటా నిరసన వ్యక్తం చేసింది.

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.