మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

మెట్రో ట్రైన్‌లో నాగార్జున - నాని మల్టీ స్టారర్ షూటింగ్

Updated: 29-03-2018 12:06:07

కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనిదత్ , టీ. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న మల్టీ స్టారర్ ఉగాది (మార్చి 18) నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో మియాపూర్ స్టేషన్ లో మెట్రో ట్రైన్ లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అందులో నాని, రశ్మిక మందన్న లతో పాటు సంపూర్ణేష్ బాబు ఉన్న సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో చిత్రం మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది.

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.