ఇంతలో ఎన్నెన్ని వింతలో విడుదల
Updated:
03-04-2018 09:04:49
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ నాయకానాయికలుగా నటిస్తోన్న చిత్రం `ఇంతలో ఎన్నెన్ని వింతలో`. వర ప్రసాద్ వరికూటి దర్శకుడు. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందు మాట్లాడుతూ, `
లైఫ్ ఇస్తాడని సినిమా చేసా
` స్నేహితులు, బంధువులంతా సినిమా చూసి చాలా బాగుందన్నారు. దీంతో మంచి సినిమా అనే నమ్మకం బలంగా ఉంది. అందుకే ప్రమోషన్ ను కూడా బాగా చేస్తున్నాం. మంచి లవ్ స్టోరీ ఇది. నా ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఎలా కాపాడుకున్నాను అనేది దర్శకుడు వైవిథ్యంగా చెప్పారు. ఒక హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ పర్ పెక్ట్ గా కుదిరాయి. ఇందులో పూజా రామచంద్రన్ పాత్ర చాలా బాగా వచ్చింది. సినిమాలో ఒక మెయిన్ ట్విస్ట్ ఆమె పాత్రనే. ఉంగరాల జుత్తు...ఎట్రాటిక్ట్ వ్ గా ఉంటుందని తనని తీసుకున్నాం. సౌమ్య వేణుగోపాల్ `కాటమరాయుడు` తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆమె పాత్ర కూడా బాగుంటుంది. కృష్ణతేజ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. హైదరాబాద్ ముస్లీమ్ పాత్రలా ఉంటుంది. హీరోయిన్ స్నేహితులు ఇరుక్కునే పరిస్థితులు చాలా సరదగా ఉంటాయి. నా భార్య గీతా మాధురి సినిమా చూసింది. మంచి సినిమా చేసావ్ అని మెచ్చుకుంది. ఇలాంటి కథలే చేయమని సలహాలు ఇచ్చింది.
పక్కా కమర్శియల్ సినిమా
మా డైరెక్టర్ వి. వి.వినాయక్ గారి దగ్గర పనిచేసారు. `అదుర్స్`, `కృష్ణ` సినిమాల్లో ఆయనది కీ రో ల్. అలాగే `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమా కు పనిచేశారు. ఆ పంథా కథల్లా ఉండే పక్కా కమర్శియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది . అలాగే ఆయన `ఐఫోన్` అనే ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. మేకింగ్ చాలా బాగుంటుంది. అందులో డైలాగులుండవు. అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయనతో సినిమా చేస్తే ఒక లైఫ్ ఇస్తాడని నమ్మకం కల్గింది.
అందరికీ నచ్చుతుంది
ప్రతీ సినిమా పై నమ్మకం ఉంటుంది. కానీ సినిమా రిజల్ట్ అనేది చాలా విషయాలతో ముడిపడి ఉంటుంది. అందుకు చాలా కారణాలున్నాయి. ఏ సినిమా అయినా నచ్చితేనే జనాలు చూస్తారు. లేకపోతే థియేటర్ కు ఎవ్వరు వెళ్లరు. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఎంత మంది చూసినా ఎక్కడా డిజప్పాయింట్ కాకుండా థియేటర్ నుంచి బయటకు వస్తారు. బాగుందనే అంటారు. అది మాత్రం నమ్మకంగా చెప్పగలను.
నందుతో కమర్శియల్ సినిమాలు చేయోచ్చంటారు
ఈ సినిమా చూసిన తర్వాత నందుతో కమర్శియల్ సినిమాలు చేయోచ్చని చాలా మందికి నమ్మకం కలుగుతుంది. `100 పర్సంట్ లవ్` లా ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. నిశ్చితార్ధం నుంచి పెళ్లి లోపు జరిగే సంఘటనలే సినిమా. యాజమాన్యమంచి సంగీతం సమకూర్చారు. మా సినిమాలో ఒక పాటకి యూ ట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ? అది ఎంత పెద్ద విషయమో అందరికీ తెలుసు. అలాగే మంచి రీ రికార్డింగ్ కూడా అందించారు. నిర్మాతలు సినిమా కోసం ఎక్కడా రాజీ పడలేదు. అంతా కథపై నమ్మకంతో చేశాం.