మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

షూటింగ్‌ పూర్తి చేసుకున్న భారీ గ్రాఫిక్‌ చిత్రం భద్రకాళి

Updated: 02-05-2018 02:30:08

ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో సీనియర్‌ నటి సీత టైటిల్‌ పాత్రలో యువ నిర్మాత చిక్కవరపు రాంబాబు అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో  రూపొందిస్తున్న చిత్రం 'భద్రకాళి'. ఈ చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.హెచ్‌. రాంబాబు మాట్లాడుతూ - ''మా బేనర్‌లో నిర్మిస్తున్న 'భóద్రకాళి' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రాజమండ్రి, విజయవాడ, సేలం, మేచేరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాం. ఇందులో సీత అమ్మవారు (భద్రకాళి)గా అద్భుతంగా నటించారు. అమ్మవారికి, భక్తుడికి, దుష్ట శక్తికి మధ్య జరిగే కథ ఇది. తమిళనాడులో ఒక భక్తుడికి జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య వచ్చే 25 నిమిషాల గ్రాఫిక్స్‌ విజువల్స్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తాయి. కథకి అనుగుణంగా హైదరాబాద్‌ సారథీ స్టూడియోస్‌లో ప్రవీణ్‌ ఆధ్వర్యంలో మంచి క్వాలిటీతో గ్రాఫిక్‌ వర్క్‌ జరుగుతోంది. మా దర్శకుడు కె.ఎం. ఆనంద్‌ కథను ఎంత బాగా చెప్పారో చెప్పినదానికంటే అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. సంగీత దర్శకుడు ఆదీష్‌ ఉత్రియన్‌ మంచి ఆడియోతో పాటు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. విజయ్‌ తిరుమూలం కెమెరా వర్క్‌ సినిమాకి ప్లస్‌ అవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌ నెలాఖరుకి భారీ పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.
 
సీత, సంధ్య, మనీష్‌, చలపతిరావు, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, చిత్రం శ్రీను, జయవాణి, ఢిల్లీ గణేశన్‌, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ తిరుమూలం, సంగీతం: ఆదీష్‌ ఉత్రియన్‌, గ్రాఫిక్స్‌: సారథీ స్టూడియోస్‌, ఎడిటింగ్‌: వినయ్‌రామ్‌,  నిర్మాత: సి.హెచ్‌. రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్‌.

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.