నాకు లూప్‌హోల్స్ లేవు.. నేను ఎవరికీ భయపడను: పవన్ కళ్యాణ్
Updated:
16-03-2018 12:57:22
గుంటూరు: తనకు లూప్‌హోల్స్ లేవని, తాను ఎవరికీ భయపడబోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. లూప్ హోల్స్ ఉన్నవారు భయపడతారని చెప్పారు. తనను తొలుత టీడీపీ మనిషన్నారని, ఇప్పుడేమో బీజేపీ మనిషినంటున్నారని పవన్ వాపోయారు. తాను ఏ పార్టీ డైరక్షన్‌లోనూ పనిచేయడం లేదని, ప్రజల డైరక్షన్‌లో పనిచేస్తున్నానని చెప్పారు. తాను ఈ నెల ఐదున అవిశ్వాసం పెట్టాలని చెబితే ఈ నెల 23కు పెడతామన్నారని, మళ్లీ సడన్‌గా తేదీ ఎందుకు మార్చుకున్నారని పవన్ ప్రశ్నించారు. గుంటూరులో అతిసార బాధిత కుటుంబాలను పవన్ పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పవన్ ఎండగట్టారు. మరోవైపు అటు ఢిల్లీలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. పార్లమెంట్ లోపలా, బయటా ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ ఇచ్చిన నోటీసులు అందాయని, అయితే సభ సజావుగా నడిపే పరిస్థితి లేనందున లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.