విజయసాయిరెడ్డిపై విరుచుకుపడిన పరిటాల సునీత
Updated:
28-03-2018 09:02:09
విజయవాడ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తన భర్త పరిటాల రవీంద్రపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి కనీస సంస్కారం కూడా లేదన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు విజయసాయిరెడ్డి లేదన్నారు. ఎంతోమంది మహిళల పసుపు, కుంకుమలు తుడిచేసిన వ్యక్తులని దుమ్మెత్తి పోశారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ వారి కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.